పూనకాలు తెప్పిస్తున్న రెబెల్‎వుడ్ లైనప్.. ఒకదాన్ని మించి మరొకటి.. 

25 September 2025

Prudvi Battula 

ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‏‎లో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ రొమాంటిక్ హారర్ మూవీ.

ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ సినిమా సెట్స్‎లో వర్క్ చేస్తున్నారు డార్లింగ్. ఆయనతో మరో మూవీకి కూడా సైన్ చేసారు.

సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న స్పిరిట్ మూవీపై మంచి హైప్. ప్రభాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్న చిత్రమిది.

అలాగే 2023 బ్లాక్ బస్టర్ సలార్ కొగసాగింపుగా వస్తున్న సలార్ పార్ట్ 2: శౌర్యంగ పర్వం. ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

డార్లింగ్ లైనప్‎లో మరో సీక్వెల్ ఉంది. అదే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న కల్కి పార్ట్ 2. దీనికి హాలీవుడ్ రేంజ్‎లో మంచి క్రేజ్ ఉంది.

అలాగే లేటెస్ట్ సెన్సేషన్ మహావతార్ నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్‎లో సలార్ సహా రెండు చిత్రాల్లో నటించేందుకు సైన్ చేసారు డార్లింగ్.

వీటితో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో ఓ సినిమా చేయనున్నారు. దీనికి ప్రశాంత్ వర్మ దర్శకుడు.

అలాగే టాలీవుడ్ వరదరాజ్ మన్నార్ పృథ్వీరాజ్ సుకుమారన్‎ దర్సకత్వంలో ఓ సినిమా, LCUలో ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం.