పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసిన జాన్వీ కపూర్.. ఏమన్నారంటే..?

16 September 2025

Prudvi Battula 

జాన్వీ కపూర్.. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది.

ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్‎కి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పెద్దిలో రామ్ చరణ్‎కి జోడిగా నటిస్తుంది.

మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు శిఖర్‌ పహారియాతో జాన్వీ రిలేషన్‌షిప్‌లో ఉందంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

దీనిఫై వీరిద్దరిలో ఎవరూ ఈ వార్తలపై స్పందించలేదు. ఒకే వేడుకలో వారిద్దరు కనిపిస్తే చాలు ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవడం పక్కా.

దీంతో ‘పెళ్లెప్పుడు?’ అని ప్రశ్నకి.. జాన్వీ ప్రస్తుతం నటనపైనే దృష్టి పెట్టాను, పెళ్లికి ఇంకా టైం ఉందని బదులిచ్చింది. శిఖర్‌ గురించి మాత్రం ఏం మాట్లాడలేదు.

ముంబయిలో జరిగిన ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ అనే సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చింది జాన్వీ.

వరుణ్‌ధావన్‌‎కి జోడిగా జాన్వీ కపూర్ నటించిన చిత్రమిది. శశాంక్‌ ఖైతాన్‌ తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకి రానుంది.

తన ఫోన్‌లో స్పీడ్‌ డయల్‌ లిస్ట్‌‎లో తన తండ్రి, చెల్లితో పాటు శిఖర్‌ పేర్లు ఉన్నాయని ఓ సందర్భంలో చెప్పడంతో రూమర్స్‌ మొదలయ్యాయి.