అప్పుడు డార్లింగ్‎ హీరోయిన్‎.. ఇప్పుడు బిగ్‎బాస్ కంటెస్టెంట్‎.. ఈమెను గుర్తుపట్టారా.? 

11 September 2025

Prudvi Battula 

సెప్టెంబర్ 7న తెలుగు బిగ్‎బాస్ సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ సారి బిగ్‎బాస్‎లో సాధారణ ప్రజలకు కూడా అవకాశం దక్కింది.

ఇందులో 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అయితే ఈ సీజన్‎లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోయిన్ కూడా కంటెస్టెంట్‎గా అవకాశం అందుకుంది.

అప్పట్లో డార్లింగ్ సినిమా సహా మరికొన్ని తెలుగు సినిమాల్లో ఈ కన్నడ భామ.. కొన్నాళ్లగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఇప్పుడు సడన్‎గా బిగ్‎బాస్‎లో ప్రత్యక్షం అయింది.

అప్పట్లో తెలుగు, కన్నడ సినిమాల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పడు తెలుగు బిగ్‎బాస్ సీజన్ 9 కంటెస్టెంట్‎గా పాల్గొంది.

ఆమె మరెవరో కాదు బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్‎తో కలిసి నటించిన హీరోయిన్. అదేంటి ఆ సినిమాలో హీరోయిన్ త్రిష కదా అనుకుంటున్నారా.?

బిగ్‎బాస్‎కి వచ్చేంత టైం త్రిషకి ఎక్కడ ఉంటుంది లెండి. ఆమె మరెవరో కాదు సంజన గల్రానీ. బుజ్జిగాడులో సెకండ్ హీరోయిన్.

బుజ్జిగాడు సినిమాలో త్రిషకి చెల్లిగా కంగనా అనే పాత్రలో నటించింది ఈ వయ్యారి. ఇందులో సంజన నటన అద్బుతంగా ఉంటుంది.

సంజన గల్రానీ తెలుగులో బుజ్జిగాడు సహా సోగ్గాడు, సత్యమేవ జయతే, అవును 2, సర్దార్ గబ్బార్ సింగ్ వంటి మరికొన్ని చిత్రాల్లో కూడా కనిపించింది.