బ్లాక్ డ్రెస్‌లో హాట్‌గా ముస్తాబైన రాశిఖన్నా.. అందాలతో చెమటలు పట్టిస్తోందిగా!

samatha.j

28 January 2025

Credit: Instagram

టాలీవుడ్ బ్యూటీ రాశిఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఊహలు గుస గుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ, ఈ మూవీలో తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

దీంతో ఈ బ్యూటీకి వరసగా ఆఫర్లు వచ్చాయి. చూడటానికీ చబ్బీగా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అందంతో అందరినీ తన వైపుకు తిప్పుకుంది.

కానీ ఎంత అందం ఉండి ఏం లాభం. ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలా వరకు  బెడిసి కొట్టడంతో ఇప్పుడు ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు కరువు అయ్యాయి.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలతో రచ్చ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా బ్లాక్ డ్రెస్‌లో పరువాల విందు ఇచ్చింది.

Fashionably gothic🖤 For #agathiyaa promotions అంటూ బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఇందులో హెయిర్ లీవ్ చేసి, గ్లామరస్‌గా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుంది ఈ బ్యూటీ.దీంతో మైండ్ బ్లోయింగ్, క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు తన అభిమానులు.

కాగా, రాశిఖన్నా ఇటీవల నటించిన యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం అగథియా మూవీ ప్రమోషన్స్ కోసం ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది.