పెళ్లి తర్వాత స్లో అయిన రకుల్.. అమ్మడి ఫోకస్ అంతా అక్కడే 

Rajeev 

17 April 2025

Credit: Instagram

 రకుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మడి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అందంతో, నటనతో తెలుగు ప్రజలను కట్టిపడేసింది. 

మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించి 2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’తో తన హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించింది.

ఆ తరువాత 2011 కెరటంలో సిద్ధార్థ్ రాజ్‌కుమార్ సరసన నటించింది. తెలుగులో రకుల్ మొదటి సినిమా ఇది. 

ఆ తరువాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా సక్సెస్ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ వయ్యారి భామ. 

ఇటీవలే తాను ప్రేమించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానీ నీ ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.

ప్రస్తుతం రకుల్ సినిమాల స్పీడ్ తగ్గించింది. ఆచి తూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగులో చాలా కాలం అయ్యింది ఈ అమ్మడు కనిపించి.