బ్లాక్ డ్రెస్‌లో బ్యూటిఫుల్‌గా.. రకుల్ అందాల సెగలు

18 october 2025

Samatha

అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

కెరటం సినిమాతో వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

ఈ మూవీలో ఈ బ్యూటీ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. తన అందం, నటనతో అంతలా ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక ఈ మూవీ తర్వాత వరసగా ఆఫర్స్ వచ్చాయి.

కరెంట్ తీగ, సరైనోడు, ధృవ, కిక్2 బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో ఇలా చాలా సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చక్కేసి అక్కడ వరస సినిమాలతో అందరినీ ఆకట్టుకుంది. అక్కడ కూడా తన సత్తా చాటింది.

ఇక తర్వాత అక్కడే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానిని వివాహం చేసుకుంది. ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ , బిజినెస్ లు చూసుకుంటూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తన క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది.

బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో తన అంద చందాలతో అందరనీ తన వైపుకు లాక్కుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.