పెళ్లికి వేళాయే.. రాహుల్ సిప్లిగంజ్ ఇంట మొదలైన పెళ్లి సందడి!

25 october 2025

Samatha

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన గాత్రంతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు.

ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లి తన ఆటతీరు, తన పాటలతో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా, యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు.

ఇక ఈయన త్వరలో పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే,  ఆగస్టులో ఎంగేజ్ మెంట్ చేసుకున్న రాహుల్ ఇంట పెళ్లి పనులు మొదలు అయ్యాయి.

రాహుల్ సిప్లిగంజ్, త్వరలో హైదరాబాద్‌కు చెందిన హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు, త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిపోయాడు.

ఈ నెల అక్టోబర్ చివరిలో వీరి పెళ్లి జరగనున్నదంట. ఇక ముహుర్తం తేదీ కూడా దగ్గర పడుతుండటంతో రాహుల్ ఇంట పెళ్లి పనులు మొదలు అయ్యాయి.

అయితే తాజాగా లగ్న పత్రికకు సంబంధించిన వేడుక జరగగా,  దానికి సంబంధించిన ఫొటోలు ఇన్ స్టాలో షేర్ చేయగా అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అందులో రాహుల్, హరిణ్యలు పసుపు దంచుతూ,ఆనందంగా ఉన్న ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో తన ఫ్యాన్స్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.