ఒక్క సినిమాతో అరడజన్ అవార్డులు.. ఎవరా ముద్దుగుమ్మ.? 

25 September 2025

Prudvi Battula 

ఒక్క తెలుగు సినిమా ఆ ముద్దుగుమ్మని అంబరానికి తీసుకెళ్లింది. అందులో తన నటనకి 6 అవార్డులు కైవసం చేసుకుంది.

తర్వాత చాల సినిమాలు చేసినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని హిట్ అయినా వాటిలో ఆమె పాత్ర అంతంతమాత్రమే.

ప్రస్తుతం ఆమె రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుంది. ఇటీవల బాలయ్య సరసన ఓ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది.

నెక్స్ట్ బాలయ్య హ్యాట్రిక్ మూవీ చేయనుంది. మీకు ఇప్పటి అర్థమై ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. ఆమె ప్రగ్య జైస్వాల్.

వరుణ్ తేజ్ కంచె సినిమాలో సీత అనే పాత్రలో కనిపించి  తెలుగు యువత మనసు దోచేసిన అందాల తార ప్రగ్య జైస్వాల్.

ఈ సినిమాలో సీతగా ఆమె నటన అద్భుతంగా అనిపిస్తుంది. కంచె సినిమాకి అరడజన్ అవార్డులు కైవసం చేస్తుంది ఈ వయ్యారి భామ.

2016లో కంచె చిత్రానికి ఉత్తమ తెలుగు డెబ్యూ నటిగా ఫిల్మ్‌ఫేర్, SIIMA, సినీమా, ఉగాది పురస్కారాలు, జీ తెలుగు అప్సర, TSR – TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వారిచే 6 అవార్డులు అందుకుంది.

ప్రస్తుతం బాలయ్యకి జోడిగా అఖండ 2 తాండవం సినిమాతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన టైసన్ నాయుడు మూవీ చేస్తుంది.