ఇంకొక ఛాన్స్ అన్న: పవన్ ఫ్యాన్స్.. 

Prudvi Battula 

11 February 2025

పవన్ కళ్యాణ్‎తో సినిమా అంటే ఎలా ఉంటుందో నిర్మాతలకు బాగా తెలుసు. ఆయన రాజకీయాల్లో ఉండటం, పైగా అధికారంలో ఉండటంతో షెడ్యూల్ టైట్‎గా ఉంటుంది.

అన్నీ తెలిసి ఆయనతో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యారు కొంతమంది నిర్మాతలు. అలాగే అడ్వాన్స్‎లు కూడా ఇచ్చారు.

ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం. కొన్ని శాఖలు ఆయన చేతలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో పవన్ నుంచి సినిమాలు ఆశించడం అనేది అత్యాశ అవుతుంది.

అయితే ఆయన ఒప్పుకున్న సినిమాల్లో దాదాపు అన్నీ చివరి దశకు వచ్చేయడం ఒకటే కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి.

అందుకే మిగిలిన సినిమాలకు కూడా పూర్తి చేస్తే అయిపోతుంది కదా అని దర్శక నిర్మాతల భావన. అయితే ఫ్యాన్స్ నుంచి మాత్రం పవన్‎కు కొన్ని విన్నపాలు వస్తున్నాయి.

వాటిని ఎంతవరకు ఆయన తీసుకుంటారనేది చూడాలి. తాను డేట్స్ ఇచ్చినప్పుడు దర్శక నిర్మాతలు యూజ్ చేసుకోలేదు అనేది పవన్ చెబుతున్న మాట.

కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ డేట్స్ ఏవో ఇంకొకసారి ఇవ్వండి అన్నయ్య. ఈసారి పక్కా పూర్తి చేస్తాము మాది హామీ అంటున్నారు.

పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు దాదాపు పూర్తయ్యాయి. ఒకటి మాత్రం 10% మాత్రమే పూర్తయింది.

మూడోది పక్కన పెట్టినా పర్లేదు కానీ ముందు అయితే ఆ రెండు సినిమాలన్నీ పూర్తి చేయాలని ఫాన్స్ కోరుకున్నారు.