డిసెంబర్ తొలివారం డిజిటల్‎లో సందడి చేయనున్న సినిమాలు.. 

06 December 2024

Battula Prudvi

శివకార్తికేయన్, సాయి పల్లవి ప్రధానపాత్రల్లో మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‎గా వచ్చిన ‘అమరన్’ డిసెంబర్ 5న నెట్‎ఫ్లిక్స్‎లో ప్రసారం అవుతుంది.

వరుణ్ తేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘మట్కా’ డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రసారం అవుతుంది.

అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ యాక్షన్‌ థ్రిల్లర్ ‘జిగ్రా’ సినిమా నెట్‎ఫ్లిక్స్ వేదిక డిసెంబర్ 6న స్ట్రీమింగ్ కానుంది.

జయం రవి, ప్రియాంక మోహన్ జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా ‘బ్రదర్’ డిసెంబర్ 6, 2024న జీ5లో ప్రదర్శించబడుతుంది.

‘అగ్ని’ అనే ఓ హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

‘ఎ నాన్సెన్స్ క్రిస్మస్ విత్ సబ్రినా కార్పెంటర్’ డిసెంబర్ 6, 2024 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది.

క్రిస్ స్మిత్ తెరకెక్కించిన ఇంగ్లీష్ డాక్యూమెంటరీ ఫిల్మ్ ‘బిగ్గెస్ట్ హేస్ట్ ఎవర్’ నెట్‎ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 6 నుంచి స్ట్రీమ్ కానుంది.

లైంగిక వేధింపులకు గురైన తన కూతురికి న్యాయం అందించడంలో ఒక తల్లి పోరాటమే  ‘మేరీ’. డిసెంబర్ 6 నుంచి ఈ సిరీస్ జీ5లో అందుబాటులో ఉంటుంది.