వసూళ్ల సునామి.. ఆ సినిమా లాంగ్ రన్‌ను బీట్ చేసిన ఓజీ..
06 October 2025
Prudvi Battula
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ గ్యాంగ్ స్టార్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఓజి'. ప్రస్తుతం బారి వసూళ్లతో దూసుకుపోతుంది.
ఈ ఏడాది సెప్టెంబరు 25న విడుదలైన ఈ చిత్రం 11 రోజుల్లోనే ఓ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ లాంగ్ రన్‌ను బీట్ చేసింది.
తోలి రోజే రూ.154 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది ఈ చిత్రం. తొలిరోజు ఈ స్థాయిలో కొల్లగొట్టిన ‘ఓజీ’ పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే రికార్డు సెట్ చేసింది.
ఈ సినిమా విడుదలైన 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.308 కోట్లకుపైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇంకా కొనసాగుతుంది.
దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్లతో ఈ ఏడాదిలో టాప్‌లో నిలిచిన వెంకటేశ్ - అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫుల్‌రన్‌ను ‘ఓజీ’ 11 రోజుల్లోనే అధిగమించింది.
వీరాభిమాని దర్శకుడిగా మరి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘ఓజీ’తో సుజీత్ చూపించారు. ఓజస్ గంభీరగా పవన్‌ను తెరపై స్టైలిష్‌గా చూపించారు.
ఈ సినిమా విజయం జస్ట్ ట్రైలర్ మాత్రమే. సుజీత్ భవిష్యత్తులో దానికి ప్రీక్వెల్, సీక్వెల్‌ని ఖరారు చేశారు.
ప్రీక్వెల్‌లో పవన్ తనయుడు అకీరా నందన్ ఉంటుందంటూ వార్త వైరల్ అవుతుంది. దీని గురించి ఇప్పుడే చెబితే థ్రిల్ ఉండదన్నారు మూవీ మేకర్స్.
మరిన్ని వెబ్ స్టోరీస్
పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసిన జాన్వీ కపూర్.. ఏమన్నారంటే..?
ఒక్క సినిమాతో అరడజన్ అవార్డులు.. ఎవరా ముద్దుగుమ్మ.?
పూనకాలు తెప్పిస్తున్న రెబెల్వుడ్ లైనప్.. ఒకదాన్ని మించి మరొకటి..