ప్రేలో పడ్డానంటున్న క్రేజీ బ్యూటీ.. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలా..
08 october 2025
Samatha
అందాల ముద్దుగుమ్మ నోరా ఫతేహి గురిచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది తన అందచందాలో ఎంతో మందిని ఆకట్టుకుంది.
ఈ బ్యూటీ మోడలింగ్ చేసి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. నటిగా కంటే స్పెషల్ సాంగ్స్ ద్వారా చాలా మందిని ఆకట్టుకొని, తన డ్యాన్స్ అందంతో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది.
తెలుగులో బాహుబలి సినిమాలో మనోహరి, టెంపర్ సినిమాలో ఇట్టాగేరెచ్చిపోనా అంటూ పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌తో కుర్రకార మనసు లాగేసుకుంది. మంచి ఫ్యాన్ బేస్ సపాదించుకుంది.
ఇక బాలీవుడ్‌లో కూడా చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది ఈ బ్యూటీ, కమారియా, దిల్బర్ సాంగ్స్‌లో ఈ అమ్మడు గ్లామర్‌కు, అదరిపోయే స్టెప్పులకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.
ఇక ఈ ముద్దుగుమ్మ ఐటమ్ సాంగ్‌తో తమ అభిమానుల ముందుకు వచ్చి చాలా రోజులే అవుతుంది. అయితే ఇలా లాంగ్ గ్యాప్ తర్వాత.. ప్రేమలో పడ్డానంటూ.. అభిమానుల ముందుకు వచ్చేస్తుంది ఈ చిన్నది.
రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురాన్ కాంబోలో వస్తున్న బాలీవుడ్ మూవీ థామ. ఈ సినిమా అక్టోబర్ 21న థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయిపోయింది.
ఇక ఈ మూవీ ట్రైలర్‌లో రష్మిక తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు రష్మిక కంటే, తన గ్లామర్‌తో హైలేట్ అవుతుంది ఓ చిన్నది, ఆ బ్యూటీనే నోరా ఫతేహి.
ఈ అమ్మడు థామా సినిమాలో దిల్బర్ కి ఆంఖోన్ కా అనే స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే, అయితే ఈ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేయగా అందులోఈ అమ్మడు డ్యాన్స్ యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.