రతన్‌ టాటాకీ పెళ్లి కాలేదు కదా: నిత్య మీనన్.. 

23 July 2025

Prudvi Battula 

సెలక్టివ్‌ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ క్రేయేట్ చేసుకున్నారు నిత్యా మేనన్‌. ప్రస్తుతం ఆమె నటించిన ‘సార్‌ మేడమ్‌’ విడుదలకు రెడీగా ఉంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాతూ ప్రేమపై తన అభిప్రాయాన్ని అందరితో పంచుకున్నారు ఈ బబ్లీ బ్యూటీ. అందరికి ప్రేమ వివాహం సాధ్యం కాదన్నారు.

ప్రేమ గురించి ఎన్నో సంవత్సరాల క్రితం ఆలోచించాను. ఇప్పుడు దానికి నా జీవితంలో అధిక ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం కారణంగా సోల్‌మేట్‌ ఉండడం అనివార్యమని గతంలో అనిపించేది. అతడిని వెతికిన సందర్భాలూ ఉన్నాయి.

అయితే మనం వేరేరకంగా కూడా జీవితాన్ని ఆనందించవచ్చని తర్వాత అర్థం చేసుకున్నాను. ప్రతిఒక్కరికీ ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా చేసుకోవడం సాధ్యం కాదు కదా!.

రతన్‌ టాటా కూడా వివాహం చేసుకోలేదు. పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే.. అది జరిగినా.. జరగకపోయినా మార్పు ఉండదు.

తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ, స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు నిత్య మీనన్.

జీవితంల  కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగానే ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నాను. ఏది జరిగినా మన మంచికే అనుకొని ముందుకుసాగాలి అని నిత్యామేనన్‌ తెలిపారు.