అందంతో చంపేస్తున్న నిషా.. నీ అందం చూస్తే ఆ చందమామే చిన్నబోదా!

samatha 

2 july  2025

Credit: Instagram

అందాల ముద్దుగుమ్మ నిషా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

ఏమైంది ఈ వేళ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

కానీ ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి అంతగా ఫేమ్ రాలేదు. కానీ సుకుమారుడు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో మంచి ఫేమ్ సంపాదించుకుంది.

తర్వాత ఇష్టం, సోలో, వంటి చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి లక్కు కలిసిరాలేదనే చెప్పాలి. చాలా సినిమాలు చేసినప్పటికీ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది.

మళయాలంలో భయ్యా, భయ్యా , కజిన్స్ అనే సినిమాలు చేసి, తర్వాత చిత్ర పరిశ్రమకే దూరం అయ్యింది. అంతే కాకుండాఈ బ్యూటీ వివాహం చేసుకొని తన కుటుంబంతో ఆనందంగా గడుపుతుంది.

తన భర్త, కుమారుడితో కలిసి కుటుంబంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇక చిత్ర పరిశ్రమకు దూరమైనప్పటికీ ఈ ముద్దుగుమ్మ అభిమానులకు మాత్రం దూరం కాలేదనే చెప్పాలి.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ మాల్దీవ్స్‌కు వెకేషన్‌కు వెళ్లింది.

అక్కడ తన కుటుంబంతో కలిసి ఎంజయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా వాటిపై ఓ లుక్ వేయండి.