సినిమాల స్పీడ్ తగ్గించిన సీతారామం బ్యూటీ మృణాల్ 

Rajeev 

Images: Pinterest

24 October 2025

మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకూర్ 2014 నుండి ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ సినిమాలు చేసి ఆకట్టుకుంటుంది. 

మొదట్లో మరాఠీ భాషా చిత్రాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 

లవ్ సోనియా, జెర్సీ, సూపర్ 30 వంటి చిత్రాలతో నార్త్ లో ఫేమస్ అయ్యింది. 2022లో విడుదలైన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

ఈ సినిమా ఆమె జీవితంలో పెద్ద మలుపు తిరిగింది. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో వరుస అవకాశాలు అందుకుంటున్న ఆమె.. చేతిలో 5కు పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

అందులో 2 తెలుగు సినిమాలు కావడం విశేషం. నివేదికల ప్రకారం మృణాల్ ఆస్తుల విలువ రూ.40 కోట్ల వరకు ఉంటుంది.

ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ప్రస్తుతం డెకాయిట్ అనే సినిమా చేస్తుంది.