ఈ వారం ఓటీటీ దద్దరిల్లిపోద్ధి.. ఒక బ్లక్ బస్టర్.. ఓ స్టార్ హీరో మూవీ..
10 October 2025
Prudvi Battula
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది.
తేజ సజ్జా హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'మిరాయ్'. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం అక్టోబర్ 10 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది.
సత్యరాజ్, వశిష్ట ఎన్. సింహ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ 'త్రిబనాధారి బార్బారిక్' అక్టోబర్ 10న అమెజాన్ ప్రైమ్, SunNXT రెండింటిలో ప్రసారం అవుతుంది.
18 రోజుల మహాభారత యుద్ధం ఆధారంగా రూపొందిన యానిమేటెడ్ పౌరాణిక ఇతిహాస సిరీస్ 'కురుక్షేత్ర' అక్టోబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
రెడ్డి వీర్ నటించిన లీగల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'లీగల్లీ వీర్' మూవీ అక్టోబర్ 10న లయన్స్‌గేట్ ప్లేలో ప్రసారం అవుతోంది.
'సెర్చ్: ద నైనా మర్డర్ కేస్' అనే క్రైమ్ సిరీస్ జియో హాట్‌స్టార్ వేదికగా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
రూత్ వేర్ నవల ఆధారంగా రూపొందిన 'ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10' అనే గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమ్ అవుతుంది.
'ఓల్డ్ మనీ' అనే రొమాంటిక్ టర్కిష్ డ్రామా నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 10 నుంచి ఓటీటీలో ప్రసారం అవుతుంది.