ఏప్రిల్ తొలి వారం డిజిటల్లో సందడికి సిద్దమైన సినిమాలు, సిరీస్లు ఇవే..
04 April 2025
Prudvi Battula
సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా తెరకెక్కిన మజాకా సినిమా జీ5 వేదికగా మార్చ్ 28 నుంచి ఓటీటీలో సందడి చేస్తుంది.
మధుశాల అనే ఓ తెలుగు సినిమా మార్చి 31 నుంచి ఈటీవీవిన్ యాప్లో డిజిటల్ ప్లేట్ ఫామ్ లో సందడి చేస్తుంది.
ధనుష్ దర్శకత్వంలో వచ్చిన నిలవుకు ఎన్మేల్ ఎన్నడి కోబం అనే తమిళ చిత్రం జాబిలమ్మ నీకు అంతా కోపమా పేరుతో తెలుగులో మార్చి 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సందడి చేస్తుంది.
ఉద్వేగం అనే ఓ తెలుగు సినిమా ఈటీవీవిన్ యాప్లో ఏప్రిల్ 3 నుంచి డిజిటల్ ప్లేట్ ఫామ్ లో ప్రసారం అవుతుంది.
ఎస్ శశికాంత్ దర్శకుడిగా తెరకెక్కించిన తోలి చిత్రం టెస్ట్. ఇది నేరుగా నెట్ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
కాఫిర్ అనే ఓ హిందీ సినిమా ప్రముఖ ఓటీటీ యాప్ జీ5 వేదికగా ఏప్రిల్ 4 నుంచి తెలుగులో అందుబాటులో ఉంటుంది.
రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్ సిరీస్ హోమ్ టౌన్. ఇది ఏప్రిల్ 4 నుంచి ఆహాలో ప్రసారం అవుతుంది.
టచ్ మీ నాట్ అనే ఓ తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ జియోహాట్స్టార్ వేదికగా ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.