పుష్ప మూవీ హీరోగా తొలి ఎంపిక ఆ ఇద్దరు.. చివరికి బన్నీ..
24 March 2025
Prudvi Battula
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 : ది రూల్ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజై బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.
పుష్ప 2 రిలీజ్ కి ముందే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి మొత్తం దాదాపుగా రూ.1065 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.
అంతేగాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 13,500 స్క్రీన్స్ లో పుష్ప 2 సినిమాను రిలీజ్ చేసారు మూవీ మేకర్స్.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తం 1738 కోట్లు వసూళ్లు చేసి ప్రభంజనం సృష్టించింది. దీంతో బాహుబలి 2 తర్వాతి స్థానంలో నిలిచింది.
పుష్ఫ సినిమాను తెరకెక్కించిన సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్‌నే రెండో పార్ట్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా సుకుమార్ పుష్ప సినిమా కథని మొదటగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి వినిపించాడట. అయితే కొన్ని కారణాలతో రిజెక్ట్ చేశాడట.
దీని తర్వాత సుకుమార్ పుష్ప కథని బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కి వినిపించారట. కానీ అక్కడ కూడా వర్కౌట్ కాలేదట.
దీంతో ఈ కథ చివరికి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లడం, సూపర్ హిట్ అవ్వడం, బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోవడం చకా చకా జరిగిపోయాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇన్ఫ్లుయెన్సర్ టు హీరోయిన్స్.. ఎవరా ముద్దుగుమ్మలు.?
జీవితంలో పెళ్లి చేసుకోను: ఐశ్వర్య లక్ష్మీ..
గీతగోవిందంలో హీరోయిన్గా తొలి ఎంపిక ఆమెనే..