కమిట్మెంట్ ఇవ్వాలని అడిగాడు: కావ్య థాపర్..
24 March 2025
Prudvi Battula
సినీరంగంలో ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్లలో కావ్య థాపర్ ఒకరు.
మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్.. ఇప్పుడు కథానాయికగా వరుస అవకాశాలు అందుంటూ దూసుకుపోతుంది.
ఈ మాయ పేరేమిటో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఏక్ మినీ కథ చిత్రంలో నటించింది.
ఇక ఆ తర్వాత బిచ్చగాడు 2, ఊరు పేరు భైరవకోన, విశ్వం చిత్రాల్లో నటించింది. తాజాగా కెరీర్ మొదటి రోజులను గుర్తు చేసుకుంది.
కెరీర్ ప్రారంభంలో ఓ యాడ్ ఆడిషన్స్ కోసం వెళ్లినప్పుడు అక్కడున్న వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది కావ్య.
అతను నాలుగు యాడ్స్‌లో అవకాశం ఇస్తానని.. అందుకు తనను తీసుకోవాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని అడిగాడని తెలిపింది ఈ బ్యూటీ.
దీంతో కోపంతో ఇలాంటి తనకు ఇష్టం ఉండదని చెప్పెసి అక్కడి నుంచి వచ్చానని.. తనను నటిగా చూడాలని తన తండ్రి కల అని తెలిపింది.
ప్రస్తుతం కావ్యా థాపర్ తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా కొనసాగుతుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.'
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇన్ఫ్లుయెన్సర్ టు హీరోయిన్స్.. ఎవరా ముద్దుగుమ్మలు.?
జీవితంలో పెళ్లి చేసుకోను: ఐశ్వర్య లక్ష్మీ..
గీతగోవిందంలో హీరోయిన్గా తొలి ఎంపిక ఆమెనే..