చలికాలంలో చెమటలు పట్టిస్తున్న  నాగినీ బ్యూటీ..అందం అరువడిగిందా..

samatha.j

23 January 2025

Credit: Instagram

నాగినీ సీరియల్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న బ్యూటీ మౌనీ రాయ్. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే..

తన అందంతో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈ బ్యూటీ, టాలీవుడ్, బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక నాగినీ సీరియల్ ఫేమ్‌తో పలు సినిమాలు చేస్తూ, హీరోయిన్‌గా మౌనీరాయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ఈ అమ్మడు.

ముందుగా పంజాబీ సినిమాల్లో హీరోయిన్‌గా  చేసిన మౌనీ రాయ్,ఆ తర్వాత బాలీవుడ్‌తో తన లక్‌ను  పరీక్షించుకుంది. 

2018లో అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' మూవీతో బాలీవుడ్ ‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, తుమ్ బిన్ 2లో ఐటెం సాంగ్‌తో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది

అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే  హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునేవారిలో ఒకరిగా నిలిచి, రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి.

అదే విధంగా మౌనీరాయ్.. అలియా,  నాగార్జున, అమితాబ్, రణబీర్ కపూర్, షారుఖ్‌ ఖాన్‌ హీరోలుగా నటించిన బ్రహ్మాస్త్ర మూవీలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

కాగా, తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన బీచ్ ఫోటోస్ వైరల్‌గా మారాయి. బీచ్‌లో తన అందంతో కుర్రకారు మతిపొగొడుతుంది ఈ బ్యూటీ.