ఆ తారల మెరుపును తనలో దాచుకుందేమో ఈ క్యూటీ.. గార్జియస్ మాళవిక మనోజ్..

11 December 2024

Battula Prudvi

6 జూలై 2005న కేరళలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది మాళవిక మనోజ్. సౌదీ అరేబియాలోని జెద్దాలో పెరిగింది.

జెద్దాలోని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె తండ్రి మనోజ్, తల్లి ప్రసీత మనోజ్ డ్యాన్సర్.

ఈమె చిన్నతనంలోనే క్లాసిక్ డ్యాన్స్ నేర్చుకుంది. మోడల్‎గా తన కెరీర్‎ని ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ.

2022లో ప్రకాశం పరక్కట్టే అనే మలయాళీ ఫఫ్యామిలీ డ్రామా చిత్రంతో సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ భామ.

2023లో ఆదర్శ్ మధికాంధం దర్శకత్వంలో రూపొందిన వచ్చిన హారర్ మూవీ నయాది సినిమాతో తమిళంలో తొలిసారి నటించింది.

తర్వాత అదే ఏడాది వచ్చిన తమిళ రొమాంటిక్ డ్రామా ఫిలిం జో సినిమాతో తెలుగులో కూడా మంచి క్రేజ్‎ను సొంతం చేసుకుంది.

2024లో మలయాళీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఆనంద్ శ్రీబాల సినిమాలో మెరిన్ జాయ్ పాత్రలో మెప్పించింది.

తాజాగా ఈమె నటించిన సుమతి వలవు అనే ఓ మలయాళ హారర్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.