సూర్య 45లో ఆయన స్థానంలో కొత్త వ్యక్తి.! 

10 December 2024

Battula Prudvi

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నారు. ఇదే ఆయన 45వ చిత్రం. సూర్య 45 వర్కింగ్ టైటిల్‎తో రూపొందుతుంది.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థలో ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.

ఈ ఏడాది అక్టోబర్‎లో అనౌన్స్ చేసిన ఈ సినిమాలో సూర్యకి జోడిగా స్వాసికా విజ‌య్‌ కథానాయకిగా నటిస్తున్నారు.

అంత ఓకే అనుకొంటున్న సమయానికి సూర్య 45 మూవీ మేకర్స్ ఈ సినిమా విషయంలో సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు.

ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ సమయంలో సంగీత దర్శకుడిగా ఏఆర్‌ రెహమాన్‌ను తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు మేకర్స్.

కానీ ఇప్పుడు ఆయన స్థానంలో సాయి అభయంకర్ అనే కొత్త సంగీత దర్శకుడ్ని తీసుకుంటున్నట్టుగా వెల్లడించిన మూవీ టీం.

కేవలం రెండు సింగిల్స్ మాత్రమే చేసిన 20 ఏళ్ల సాయి అభయంకర్‌, ప్రస్తుతం బెంజ్‌ మూవీకి వర్క్ చేస్తున్నారు.

ఇప్పుడు రెండో సినిమాగా సూర్య 45కి సైన్ చేశారు. కెరీర్ స్టార్టింగ్‎లోనే సూర్య సినిమా ఛాన్స్ కొట్టేసారు.