ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడికి సిద్ధం అంటున్న సినిమాలు ఇవే..

09 December 2024

Battula Prudvi

సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్‌ జంటగా రూపొందిన ప్రేమ కథ చిత్రం ‘మిస్‌ యు’ ఈ నెల 13న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ప్రణయగోదారి’ అనే ఓ తెలుగు గ్రామీణ నేపధ్య సినిమా డిసెంబరు 13న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.

వేదిక ప్రధానపాత్రలో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఫియర్‌’ డిసెంబరు 14న విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.

డిసెంబరు 12న ఈటీవీ విన్‌ వేదికగా ప్రసారం కానున్న తెలుగు కామెడీ రొమాంటిక్ డ్రామా సినిమా ‘రోటి కపడా రొమాన్స్‌’.

‘హరి కథ: సంభవామి యుగే యుగే’ అనే ఓ తెలుగు సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా డిసెంబరు 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

మలయాళం సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ‘బోగన్‌ విల్లియా’ సోనీలివ్‎లో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో అందుబాటులో ఉంటుంది.

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ యానిమేటెడ్ మూవీ ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’ డిసెంబరు 12 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌‎లో స్ట్రీమింగ్‎కి సిద్ధంగా ఉంది.

‘క్యారీ ఆన్’ రాబోయే అనే ఇంగ్లీష్‌ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిసెంబరు 11 నుంచి నెట్‎ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ కానుంది.