విజయశాంతిని హీరోయిన్‌గా పరిచయం చేసింది ఎవరు.?
08 December
2024
Battula Prudvi
ఇప్పుడు ఎప్పుడన్నా... ఏ ఒక్కరో, ఇద్దరో తెలుగు హీరోయిన్లు కనిపిస్తే 'మన తెలుగమ్మాయిలు' అంటూ ఇష్టంగా చెప్పుకునే కల్చర్ వచ్చింది.
అయితే ఒకప్పుడు టాలీవుడ్‌లో చాలా మంది తెలుగు హీరోయిన్లే ఉండేవారు. స్టార్ హీరోల చిత్రాల్లో నటించి సూపర్ అనిపించుకునేవారు.
వారిలో ఒకరే లేడీ అమితాబ్ బచ్చన్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రాణం పోసిన నటి.
ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసింది లేడీ కెప్టెన్
విజయ నిర్మల
. ఈ విషయాన్ని విజయశాంతి పలుమార్లు సినీ అభిమానులకు చెప్పారు.
''నన్ను కళాకారిణిగా విశ్వసించి, కృష్ణగారితో హీరోయిన్‌గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించింది విజయనిర్మలగారు" అంటుంటారు లేడీ సూపర్ స్టార్.
24 జూన్ 1966లో వరంగల్‌లోని అనపర్తికి చెందిన తెలుగు కుటుంబంలోని అప్పటి మద్రాస్‌లో జన్మించారు లేడీ అమితాబ్ విజయశాంతి.
1980లో ఖిలాడీ కృషుడు సినిమాతో సూపర్ స్టార్ కృష్ణకి జోడిగా తెలుగు తెరకు పరిచయమై అనేక సినిమాల్లో నటించారు.
తెలుగులో దాదాపు అందరు సీనియర్ స్టార్ హీరోలకి జోడిగా నటించారు ఈమె. 2020లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరులో కీలక పాత్ర పోషించారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం ఈ కోమలిని గుండెల్లో పెట్టి ఆరాధిస్తుంది.. మెస్మరైజ్ అనన్య..
ఈ ముద్దుగుమ్మ సోయగానికి అందం తల వంచుతుంది.. గార్జియస్ దిశా..
ఈ వయ్యారి సొగసుతో హిమ శిఖరం కరగదా.. సిజ్లింగ్ అనుక్రీతి..