కలర్ ఫోటో డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. 

08 December 2024

Battula Prudvi

తాజాగా డిసెంబర్ 7న తెలుగు దర్శకుడు సందీప్ రాజ్ తిరుమలలో శ్రీవారి సమక్షంలో ఓ నటిని వివాహం చేసుకున్నారు.

కలర్ ఫోటో సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చకున్న ఆయన తన తొలి మూవీలో చిన్న పాత్ర చేసిన చాందిని రావుని పెళ్లి చేసుకున్నారు.

కొద్దిరోజుల క్రితం వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. తాజాగా జరిగిన వీరి జరిగిన్స్ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు ఆయన ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు.

అతితక్కువ మంది అతిధుల సమక్షంలో నటి చాందిని రావు మెడలో మూడుముళ్లు వేసారు టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్.

పెళ్ళికి వచ్చిన వారిలో టాలీవుడ్ నటి దివ్య శ్రీపాద, నటుడు వైవా హర్ష, యాంకర్ సుమ కొడుకు రోషన్ తదితరులున్నారు.

సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారడం ఆపై మూడు ముళ్ల బంధం వరకు వెళ్లింది.

షార్ట్‌ ఫిల్మ్‌లతో కెరీర్‌ ప్రారంభించిన సందీప్‌ రాజ్‌ .. కలర్‌ ఫోటో చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం సుమ- రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌తో మోగ్లీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది.

న‌టి చాందీని రావు విష‌యానికి వ‌స్తే.. కలర్‌ఫొటో, రణస్థలి, హెడ్‌ అండ్ టేల్స్‌తోపాటు పలు వెబ్‌ సిరీస్‌లలో నటించించింది.