సంక్రాంతి బరిలోకి అజిత్ మూవీ సడెన్ ఎంట్రీ.!
10 December
2024
Battula Prudvi
కోలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ్ యాక్షన్ డ్రామా చిత్రం విడాముయర్చి.
మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మిస్తున్నారు.
ఇందులో అజిత్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటిస్తుంది. రెజీనా కసాండ్రా, అర్జున్ సర్జ, ఆరవ్ కీలక పాత్రల్లో నటించారు.
అనిరుద్ సంగీత దర్శకుడిగా వ్యవహిస్తున్నారు. తాజాగా సినిమా డబ్బింగ్ వర్క్ ఫినిష్ చేసినట్టుగా వెల్లడించారు మేకర్స్.
ఓ వైపు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు షూటింగ్‌లో పాల్గొంటునే విడాముయర్చి పనులు కూడా పూర్తి చేస్తున్నారు అజిత్.
ఇదిలా ఉంటె తాజాగా విడాముయర్చి సంక్రాంతి బరిలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు కీలక ప్రకటన చేసారు మూవీ మేకర్స్.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి పండక్కి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు కష్టపడుతోంది మూవీ టీమ్.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతికి వస్తుంది అనుకొంటే.. ఆ ఛాన్స్ విడాముయర్చి తీసుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడికి సిద్ధం అంటున్న సినిమాలు ఇవే..
ఈ ముద్దుగుమ్మ వంటి అందం ఈ లోకాన దొరకునా.. డెజ్లింగ్ ఆషిక..
ఈ గుమ్మా అందానికి ఆ చందమామ కట్టు బానిస.. గార్జియస్ మిర్న..