తగ్గేదే లేదంటున్న టాలీవుడ్ బ్యూటీస్..హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరంటే?

samatha.j

24 January 2025

Credit: Instagram

ప్రస్తుతం తెలుగు హీరోయిన్స్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మలు బాలీవుడ్‌లో కూడా తమ నటనతో ఆకట్టుకుంటున్నారు.

అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం టాలీవుడ్ బ్యూటీస్ రేంజ్ పెరిగిందనే చెప్పాలి, పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు.

కాగా, చాలా మందిలో ఓ డౌట్ ఉంటుంది. అసలు వీరి రెమ్యునరేషన్ ఎంత? ఏ హీరోయిన్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందని.దాని గురించే తెలుసుకుందాం.

రష్మికమందన్న నటించిన పుష్ప, యానిమల్ మూవీస్‌తో ఈ బ్యూటీకి పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ పెరిగింది. అయితే ఈ నటి ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుందంట.

యంగ్ బ్యూటీ శ్రీలీల కెరీర్ డౌన్ ఫాల్ అయినా ఈ బ్యూటీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటుంది. ఈ నటి ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు తీసుకుంటుంది.

హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న బ్యూటీ సాయిపల్లవి ఈ నటి ఒక్కో సినిమాకు 1.5 కోట్లు తీసుకోగా, తండేల్ మూవీ కోసం రూ. 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. 

అదేవిధంగా అటు బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న రామాయణం మూవీ కోసం ఏకంగా రూ. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్  తీసుకుంటున్నట్టు సమాచారం.