గ్లామర్ బ్యూటీ ఊర్వశి రౌటెలా తెలుగులో చేసిన ఐటమ్ సాంగ్స్ ఇవే!

samatha

20 January 2025

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

తళుక్కుమనే అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. ప్రస్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఎందుకంటే, తన గ్లామర్ డోస్ పెంచి, ఈ బ్యూటీ తన డ్యాన్స్‌తో అందరినీ మాయ చేస్తోంది. ఐటమ్ సాంగ్స్‌లో తనకు పోటీ ఎవరూ లేరని నిరూపిస్తుంది.

తాజగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలో.. దబిడి దిబిడి అంటూ థియేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ బ్యూటీ తెలుగులో ఎన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిందో, ఆ సాంగ్స్ ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన స్కంద మూవీలో ఈ బ్యూటీ కల్ట్ మామ అంటూ ఐటమ్ సాంగ్ చేసి అదరగొట్టింది.

అలాగే అక్కినేని అఖిల్ ఏజెంట్, పవన్, సాయిధరమ్ తేజ్ బ్రో  సినిమాల్లో ఈ బ్యూటీ తన డ్యాన్స్‌తో రచ్చ చేసిందనే చెప్పవచ్చు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఊర్వశీ రౌటేలా ఐటమ్ సాంగ్ చేసింది. ప్రస్తుతం మరోసారి డాక్ మహారాజ్‌తో అందరినీ తనవైపు లాక్కుంది.