సంగీత్‌లో సరదాగా.. కీర్తి కలర్ ఫుల్ ఫొటోస్ చూశారా!
samatha
31 January 2025
Credit: Instagram
మలయాళ ముద్దుగుమ్మ, బ్యూటీ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం.
నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే మంచి ఫేమ్ సంపాదించి స్టార్ స్టేటస్ అందుకుంది.
నాని సరసన నేను లోకల్ సినిమాతో ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది. దీని తర్వాత మహానటితో కీర్తికి మంచి గుర్తింపు రావడమే కాకుండా తన నటనతో ప్రశంసలు అందుకుంది.
ఇక ఈమధ్యనే కీర్తి తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని పెళ్లాడిన విషయం తెలిసిందే. తన చిరకాల స్నేహితుడిని కుటుంబసభ్యుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది ఈ బ్యూటీ.
15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నా సరే ఎక్కడ ఎవరికీ ఏమాత్రం డౌట్ రాకుండా తన ప్రేమను తనలోనే దాచుకుంది అమ్మడు కీర్తి సురేష్
ఇక తెర మీద ఎంతోమంది హీరోలకు ప్రేయసిగా మారిన కీర్తి సురేష్ తన మనసుని మాత్రం భద్రంగా తన ప్రేమికుడికి ఇచ్చేసింది.
ఐతే పెళ్లి అయిన వెంటనే ఈ బ్యూటీ బేబీజాన్ మూవీ విడుదలలో చాలా బిజీగా ఉండగా, ఇప్పుడు మళ్లీ పెళ్లి నాటి విషయాలను గుర్తు చేసకుంటూ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా తన మెహందీ ఫంక్షన్, సంగీత్ ఫంక్షన్ ఫొటోలను అభిమానులతో పంచుకోగా, అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.