ప్రెజెంట్ యూత్ క్రష్ కాయదు లోహర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది
2021లో పూణే ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో విజేతగా నిలిచింది కాయదు లోహర్, ఇదే ఆమెకు సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది.
2021లో కన్నడ చిత్రం "మొగిల్‌పేట"తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. "పాథోన్‌పథం నూట్టండు" (2022) చిత్రంతో మలయాళంలో సూపర్ హిట్ అందుకుంది.
తాజాగా వచ్చిన డ్రాగన్ సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో కాయదు గ్లామర్ తో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది.
ప్రస్తుతం తెలుగు, మరాఠీ, తమిళ్ చిత్రాల్లో బిజీ అయ్యిపోయింది. "థారం" మరియు "ఇధయం మురళి" వంటి చిత్రాలతో మరింత బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
కయాదు ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పుడు తన సెలబ్రిటీ క్రష్ ఎవరు అని అడిగితే.. నా ఫస్ట్ క్రష్ తలపతి విజయ్ అని తడబడకుండ చెప్పింది.
విజయ్ నటించిన తేరి సినిమా తనకు చాలా ఇష్టమట. 24 ఏళ్ళ యంగ్ బ్యూటీ 50 ఏళ్ళ దళపతి విజయ్ పై మనసు పడింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు