కార్తీక దీపం ఫేమ్ వంటలక్క నటించిన సినిమాలు ఏవో తెలుసా?

samatha 

31 January 2025

Credit: Instagram

బుల్లితెర స్టార్ ప్రేమి విశ్వనాథ్, కార్తీక దీపం ఫేమ్ వంటలక్క గురించి ప్రత్యేకంగా పరి చయం చేయాల్సి అవసరం లేదు.

మా టీవీలో టెలికాస్ట్ అయిన కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్కగా ఈ అమ్మడు చాలా ఫేమస్ అయ్యిందని చెప్పవచ్చు.

సోమవారం నుంచి శనివారం వరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సీరియల్ టైమ్‌కు ఎన్నిపనులు ఉన్నా పక్కన పెట్టి టీవీ ముందు కూర్చునేవారు.

అంటే అంతగా ఈ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా వంటలక్క తన నటనతో ఆడియన్స్‌ను మెప్పించింది అని చెప్పాలి.

ఇక ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన నటి అయినా,  తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కార్తీక దీపం సీరియల్ మొదటి భాగం ఇప్పటికే పూర్తి చేసుకొని, కార్తీక దీపం2తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.

కాగా, ఈ ముద్దుగుమ్మ, ప్రేమి విశ్వనాథ్ ఓన్లీ సీరియల్స్‌లోనే కాకుండా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఆకట్టుకుంది అంట.

 ప్రేమి విశ్వనాథ్ తెలుగులో అక్కినేని నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాలో నటించి మరోసారి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అదే విధంగా ఈ కార్తీక దీపం ఫేమ్ వంటలక్క తమిళంలో సాలెమన్ అనే త్రీడీ సినిమా చేసి అభిమానులను ఆకట్టుకున్నట్లు సమాచారం.