ప్రియాంక మళ్లీ ఇండియాలో సెటిల్ అవుతుందా.?
15 April 2025
Prudvi Battula
హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ ది బ్లఫ్ షూటింగ్ పూర్తి చేసిన ప్రియంక చోప్రా, వెంటనే ఇండియా ఫ్లైట్ ఎక్కేశారు.
ప్రజెంట్ ఇక్కడే ఎక్కవ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్‌తో పాటు ఇండియన్ మూవీస్‌తో బిజీగా ఉంటున్నారు.
మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29లో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.
ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియంక చోప్రా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
తాజాగా మరో భారీ ప్రాజెక్ట్‌కు పీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. క్రిష్ సిరీస్‌లో ఇప్పటికే రెండు సినిమాల్లో కనిపించింది ప్రియాంక.
క్రిష్ 4లో నటించేందుకు కూడా ఓకే చెప్పారట. అయితే దీనిపై క్రిష్ 4 టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ సినిమాతో పాటు ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించేందుకు కూడా ఈ గ్లోబల్ బ్యూటీ ఓకె చెప్పారన్న న్యూస్ వైరల్ అవుతోంది.
దీంతో పీసీ హాలీవుడ్ వదిలేసి మళ్లీ ఇండియాలో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నారా అన్న డిస్కషన్ మొదలైంది జనాల్లో.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఊర్వశి వీడియో వైరల్.. నెటిజన్స్ ఫైర్..
చెట్టెక్కిన సల్మాన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
అగ్రెసివ్ అయినా త్రిష.. కారణం ఇదేనా.?