అగ్రెసివ్‌ అయినా త్రిష.. కారణం ఇదేనా.? 

14 April 2025

Prudvi Battula 

టాక్సిక్‌ పీపుల్‌.. మీరెలా బతికున్నారు? అని ఓపెన్‌గానే తిట్టేశారు నటి త్రిష. అంతటిలో ఆగలేదు ఈ టాలెంటెడ్‌ యాక్ట్రెస్‌.. అసలు మీకు నిద్రెలా పడుతోంది?

రోజంతా సోషల్‌ మీడియాలో కూర్చుని అర్థం పర్థం లేని స్టఫ్‌ని పోస్ట్ చేస్తే ఫలితం ఏంటి? అంటూ ఘాటుగా విరుచుకుపడ్డారు.

మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తోంది. అసలు మీతో జనాలు ఎలా బతకగలుగుతున్నారు? మీ చుట్టుపక్కల జనాలు ఎలా ఉండగలుగుతున్నారంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు.

చెన్నై చంద్రం.. దేవుడే మిమ్మల్ని కాపాడాలంటూ ఆమె పెట్టిన పోస్టు క్షణాల్లో వైరల్‌ అవుతోంది. త్రిష కోపానికి కారణం రీసెంట్‌గా రిలీజ్‌ అయిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ గురించేనని స్పష్టమైంది.

ఈ సినిమాలో త్రిష కేరక్టర్‌లో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదని పెదవి విరిచేశారు పలువురు. అలాంటివారిని ఉద్దేశించే త్రిష ఈ పోస్ట్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది.

ఈ ఏడాది ఆల్రెడీ అజిత్‌తో పట్టుదలలో నటించారు హీరోయిన్ త్రిష. అది బాక్సాఫీస్‌ దగ్గర ఘోర పరాజయాన్ని చూసింది.

గుడ్‌ బ్యాడ్‌ అగ్లీకి మంచి రిజల్టే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో నెగటివ్‌గా ప్రచారం చేస్తున్నవారిపై స్పందించారు త్రిష.

ఆమె స్పందించి మంచి పనే చేశారు. ఈ టైమ్‌లో కామ్‌గా ఉంటే.. కెరీర్‌కి చాలా నష్టం అని వెనకేసుకొస్తున్నారు ఫ్యాన్స్.