అనుష్కా శెట్టి.. ఈ పేరు వినగానే డైనమిక్ కథానాయిక, హీరోలతో సమానంగా తలపడే అందమైన అమ్మాయి రూపం కళ్ల ముందు ప్రత్యక్ష మవుతుంది.
చక్కటి అందం, అభినయం ప్రదర్శిస్తూనే.. రాజసం ఒలికించేలా ఆమె చేసిన విభిన్న పాత్రలే సినీ అభిమానుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయేలా చేశాయి
అయితే ఈ టాలీవుడ్ స్టార్ నాయిక.. నిజ జీవితంలో ఓ అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు గతంలో సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో పంచుకుంది.
ఇది విని ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు. మరి, ఇంతకీ ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఆ సమస్యేంటంటే ‘Pseudobulbar Affect (PBA) అనే అరుదైన లాఫింగ్ డిసీజ్.
దీని గురించి స్వీటీ చెబుతూ.. నాకు లాఫింగ్ డిసీజ్ ఉంది. నవ్వడం కూడా ఓ సమస్యేనా అని మీరు అనుకోవచ్చు. కానీ నాకు మాత్రం అదే పెద్ద సమస్య!
ఎందుకంటే నేను నవ్వడం ప్రారంభిస్తే 15-20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటా. కామెడీ సినిమాలు చూసినా, కామెడీ సీన్లు చేస్తున్నప్పుడైనా.. ఒకసారి నవ్వడం మొదలుపెడితే ఆపుకోలేను.
ఒక్కోసారి పడీ పడీ నవ్వేస్తుంటా. ఇలా నా నవ్వు కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనివల్ల నాకు అసౌకర్యంగా అనిపిస్తుంటుంది.
షూటింగ్‌లో ఇలా జరిగినప్పుడు చిత్ర బృందం టీ, కాఫీ, స్నాక్స్ తీసుకోవడానికి విరామంగా ఉపయోగించుకుంటూ ఉంటారంటూ అనుస్క తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.