డార్లింగ్‏తో మూడుసార్లు హిట్టుకొట్టిన ముద్దుగుమ్మలు.. వీళ్ల క్రేజ్ వేరబ్బా..

Prudvi Battula 

Images: Pinterest

23 October 2025

ప్రభాస్ అనుష్క శెట్టి జంటగా తొలిసారి నటించిన సినిమా బిల్లా. 2009లో వచ్చిన ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ తెరకెక్కించారు.

బిల్లా

తర్వాత వీరిద్దరూ జోడిగా కొరటాల శివ డెబ్యూ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా మిర్చిలో కనిపించారు.

మిర్చి

చివరిగా డార్లింగ్ స్వీటీ కలిసి నటించిన చిత్రాలు బాహుబలి 1 అండ్ 2. రాజమౌళి దర్శకత్వంలో వచ్చి తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రాలు.

బాహుబలి 1 అండ్ 2

తర్వాత త్రిష, ప్రభాస్ కలిసి మూడు సినిమాలు చేసారు. వాటిలో మొదటికి రొమాంటిక్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన వర్షం.

వర్షం

తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా పౌర్ణమి. దీనికి ప్రభుదేవా దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది.

పౌర్ణమి

త్రిష కృష్ణన్, ప్రభాస్ హీరో హీరోయిన్లుగా నటించిన మూడో సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు.

బుజ్జిగాడు

ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా కనిపించిన తొలి చిత్రం డార్లింగ్. 2010లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికి చాలామంది ఫేవరేట్ మూవీ.

డార్లింగ్

ప్రభాస్ కాజల్‎తో కలిసి నటించిన మరో సినిమా మిస్టర్ పర్‌ఫెక్ట్. వీరిద్దరి కాంబో తెరకెక్కిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి.

మిస్టర్ పర్‌ఫెక్ట్

2025లో మంచు విష్ణు కన్నప్పలో కాజల్, ప్రభాస్ నటించారు. జంటగా కాకపోయిన వీరు ఇందులో కొంతసేపు కనిపించారు.

కన్నప్ప