ఈమెకి చేరువలో ఉంటె ఆ ఎవరెస్ట్ హెట్టెక్కుతుంది.. డేజ్లింగ్ హెబ్బా..

03 December 2024

Battula Prudvi

6 జనవరి 1989న మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ కన్నడ ముస్లిం కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ హెబ్బా పటేల్.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సోఫియా కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది ఈ అందాల తార.

2014లో నందా కిషోర్ దర్శకత్వంలో కన్నడ చిత్రం అద్యక్షతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత అదే ఏడాది తిరుమానం ఎనుమ్ నిక్కా అనే తమిళ చిత్రంతో కోలీవుడ్ రంగ ప్రవేశం చేసింది ఈ వయ్యారి భామ.

2014లో రాహుల్ రవిచంద్రన్ సరసన ఆలా ఇలా అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

2015లో యువ హీరో రాజ్ తరుణ్ కి జోడిగా కుమారి 21F అనే అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో హిట్ అందుకుంది.

దీని తర్వాత ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఏంజెల్, ఒరేయ్ బుజ్జిగా వంటి చిత్రాల్లో నటించింది.

2022లో ఓదెల రైల్వే స్టేషన్ అనే ఓటీటీ చిత్రాల్లో పల్లెటూరి మహిళా పాత్రలో ఆకట్టుకుంది. ఇటీవల ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే ఆహా చిత్రంతో మెప్పించింది.