యాంకర్ రష్మి సీరియల్స్‌లో కూడా చేసిందా.?
Prudvi Battula
Credit: Instagram
11 February 2025
యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు జబర్దస్త్, అనేక షోస్ లో యాంకర్ చేస్తూ బిజీగా ఉంది.
అంతే కాదు అందం, అభినయం ఉన్న యాంకర్‌గా వరుస షోస్ చేస్తూ బుల్లి తెరలో దుమ్మురేపుతుందనే చెప్పాలి రష్మీ.
ఇది ఇలా ఉంటే యాంకర్ రష్మి తన కెరీర్ ప్రారంభం లో పలు సీరియల్స్ లోనూ నటించిందన్న విషయం చాలామందికి తెలియదు.
సినిమా కంటే టీవీనే బెటర్ అని నిర్ణయించుకోవడానికి కారణం ఒక పరంగా ఈ సీరియల్స్ కారణమని పలు ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేసింది రష్మి.
రష్మి 2002-2003 సమయంలో 'థ్యాంక్స్' అనే చిత్రంలో హీరోయిన్ తరహా రోల్ చేయగా రొమాన్స్ తో రచ్చ చేసింది.
'థ్యాంక్స్' మూవీ ద్వారా తనకు పెద్దగా పేరు. ఆఫర్లు రాకపోవడం తో ఆమె ఇంటికెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ కొంత గ్యాప్‌తో రీఎంట్రీ ఇచ్చింది.
అదే సమయంలో మా టీవీ లో 'యువ' అనే సీరియల్‌లో నటించే ఆఫర్ వచ్చిందట. అందులో స్వాతి అనే పాత్రలో నటించి మెప్పించింది రష్మి.
దీంతోపాటు 'లవ్' అనే మరో సీరియల్ కూడా 'మా' టీవీలో చేయగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వీటి కారణంగా తనకు మళ్లీ సినిమా ఆఫర్లు వచ్చాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కాంచన 4 కోసం ఇద్దరు క్రేజీ భామలు.. ఎవరా హీరోయిన్స్.?
నార్త్ సినిమాల్లో సౌత్ హీరో పక్కా.. ఇదే నయా ట్రెండ్..
ఓదెల 2 రూట్లో మంగళవారం సీక్వెల్.. పాయల్ అవుట్..