పెళ్లైన తగ్గదేలే.. ఆ హీరోయిన్లుకు వరుస ఆఫర్లు..

05 January 2025

Battula Prudvi

టాలీవుడ్ టూ బాలీవుడ్ ఆఫ్టర్ మ్యారేజ్ ట్రెండ్ నడుస్తుంది. నయనతార, అలియా భట్, కత్రినా, దీపిక, కియారా.. ఇలా అంతా పెళ్లైన ముద్దుగుమ్మలే.

పెళ్లికి ముందు కంటే ఇప్పుడే నయన్‌కు డిమాండ్ పెరిగింది. జవాన్‌లో నటించాక సినిమాకు 18 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రక్కయిలో నటిస్తున్నారు.

కాజల్ అగర్వాల్ కూడా వరస ఆఫర్స్ అందుకుంటున్నారు. 2024లో సత్యభామ లేడీ ఓరియెంటెడ్ మాస్ యాక్షన్ చిత్రంతో ఆకట్టుకున్నారు.

విడాకుల తర్వాత సమంతను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఈ ముద్దుగుమ్మ బ్యూటీ షోకు థర్మామీటర్లు పేలిపోతున్నాయి.

ఇక అలియాకు వరస ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. 2024లో జిగ్ర సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించారు.

ఇక దీపిక విషయానికి వస్తే.. 2024లో కల్కి 2898 ఏడితో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు.

బాలీవుడ్‌లోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. 2023లో కత్రినా కైఫ్ టైగర్ 3, 2024లో మేరీ క్రిస్మస్‌తో ఆకట్టుకున్నారు.

కియారా అద్వానీకి కూడా ఆఫర్స్ ఫుల్లుగా ఉన్నాయి. మొత్తానికి పెళ్లైన ముద్దుగుమ్మలకే ఇప్పుడెక్కువ డిమాండ్ ఉంది.