నాలుగు డిజాస్టర్లు నుంచి స్టార్ హీరో.. సూర్య గురించి ఇవి తెలుసా.?
Prudvi Battula
11 February 2025
తొలినాళ్ళలో సక్సెస్ లేక తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యాడు సూర్య. కట్ చేస్తే ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ పెటర్నిటీలో తనకంటూ ఓ పేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.
సూర్య అసలు పేరు శిరవణన్ శివకుమార్. కానీ అతని పేరును కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం సూర్యగా మార్చారు.
సూర్య తన తొలినాళ్ళలోనే నటనపై ఆసక్తి చూపలేదు. తన చిన్నతనం నుంచే ఆయన సినిమా దర్శకుడు కావాలని కలలు కన్నాడు.
ఈ క్రమంలోనే తన చదువు పూర్తయ్యాక అనుకోని పరిస్థితుల్లో హీరోగా 1997లో వసంత్ దర్శకత్వం వహించిన నేరుకు నేరుతో సినీరంగ ప్రవేశం చేశారు.
అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలా వరుసగా నాలుగు సంవత్సరాలు పెద్దగా హిట్ ఇవ్వలేకపోయాడు సూర్య.
ఈ క్రమంలోనే 2001లో విడుదలైన నందా సినిమాతో సూర్య తన మొదటి హిట్ కొట్టాడు. ఆ సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక గౌతం మీనన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన కాకా కాకా చిత్రంలో సూర్య పోలీస్ ఆఫీసర్‌గా నటించి మరో హిట్ అందుకున్నాడు.
ఆయన నటించిన గజిని, సింగం లాంటి ఎన్నో సినిమాలు బాలీవుడ్లో రీమేక్ అయ్యాయి. సూర్యకు తిరుగులేని మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టాయి.
ఆ తర్వాత సూర్య నటించిన సూరరై పొట్రు పాన్ ఇండియా లెవెల్ హిట్ అందుకుంది. ఆ క్రమంలోనే జైభీమ్ సినిమా వర్గాల ప్రేక్షకులకు సూర్యను దగ్గర చేసింది.
ఇక ఇటీవల సూర్య కంగువా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఆ ఫెయిల్యూర్ నుంచి వెంటనే బయటకు వచ్చి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కాంచన 4 కోసం ఇద్దరు క్రేజీ భామలు.. ఎవరా హీరోయిన్స్.?
నార్త్ సినిమాల్లో సౌత్ హీరో పక్కా.. ఇదే నయా ట్రెండ్..
ఓదెల 2 రూట్లో మంగళవారం సీక్వెల్.. పాయల్ అవుట్..