పుష్పరాజ్ కూతురి గురించి ఈ విషయాలు తెలుసా.? 

11 December 2024

Battula Prudvi

పుష్పరాజ్‎ కూతురు ఆలోచిస్తున్నారా.? పుష్ప 2లో అల్లు అర్జున్ అన్న మొల్లేటి మోహన్ (అజయ్) కూతురు గురించే మాట్లాడుతున్నాం.

రీసెంట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 ది రూల్‎లో మొల్లేటి కావేరిగా తన నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ పేరు పావని కరణం.

30 నవంబర్ 1999న  ఆంధ్రప్రదేశ్‎లోని భూతల స్వర్గంగా పేరు పొందిన విశాఖపట్నంలో గాజువాకలో జన్మించిన తెలుగు అమ్మాయి.

పుష్ప 2కి ముందు పైలం పిల్లగా, పరేషాన్ అనే రెండు తెలుగు సినిమాల్లో కథానాయకిగా నటించింది ఈ వయ్యారి భామ.

మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే ఓ వెబ్ సిరీస్‎లో కనిపించింది. అయితే సినీ అరంగేట్రం చేసింది మాత్రం పిజ్జా సినిమాతో.

దీని తర్వాత లివింగ్ టుగెదర్ అనే ఓ రొమాంటిక్ షార్ట్‎ఫిల్మ్‎లో నటించింది. దీని తర్వాత పుష్ప 1 ది రైజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

పుష్ప 2 సినిమాలో ఈమెను చూసి ఫిదా అయినా కొందరు కుర్రాళ్ల ఈమె ఎవరు అంటూ సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తాజాగా ఇన్‎స్టా‎గ్రామ్‎లో కొన్ని గార్జియస్ ఫోటోలను షేర్ చేసింది.