విశ్వక్ చైల్డ్ ఆర్టిస్ట్‎గా కనిపించిన సినిమా ఏంటో తెలుసా.?

Prudvi Battula 

11 February 2025

మాస్ కా దాస్ విశ్వక్ సేన్  మొదటి సినిమా ‘వెళ్ళిపోమాకే’ అని అనుకుంటారు. కానీ అతను కూడా చైల్డ్ ఆర్టిస్ట్‎గా నటించాడు. అయితే అది కేవలం ఒక్క సినిమాలో మాత్రమే.

దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు నటించిన బంగారు బాబు సినిమాలో విశ్వక్ సేన్ ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు.

అప్పుడు అతను 9వ తరగతి చదువుతుండే వాడట. అదే సమయంలో దాసరి సినిమా కోసం ఛైల్డ్ ఆర్టిస్టులు కావాలన్న ప్రకటనను చూసి తన ఫొటోలు పంపించాడట.

దర్శక నిర్మాతలు కూడా ఒకే చెప్పడంతో బంగారు బాబు సినిమాకి సెలెక్ట్ అయ్యాడట. ‘మేం అప్పుడు దిల్‌షుఖ్ నగర్ లో ఉండేవాళ్ళం.

ఫస్ట్ టైం ఇంటికి వ్యాన్ వచ్చి ఎక్కించుకొని రామోజీ ఫిలింసిటీకి తీసుకెళ్లింది. అదే అప్పుడే నేను మొదటిసారి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లాను.

నా పాత్ర కు సంబంధించి షూటింగ్ ఒక్కరోజులోనే అయిపొయింది. హీరో చిన్నప్పుడు అతన్ని చెడగొట్టే బ్యాచ్‎లో నేనొకడ్ని.

ఒక రెండు షాట్స్ లో మాత్రమే కనిపిస్తాను సినిమాలో. ఇందుకు నాకు 900 రెమ్యునరేషన్ ఇచ్చారు’ అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు విశ్వక్.

తాజాగా విశ్వక్ లేడీ గెటప్‎లో నటించిన లైలా సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.