పచ్చని పొలాల్లో అందంగా.. చీరలో ఎంత ముద్దుగుందో..

Samatha

23 september 2026

Pic credit - Pinterest

యూట్యూబర్ దేత్తడి హారిక గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

యూట్యూబర్

యూట్యూబ్ స్టార్‌గా ఈ అమ్మడుకు మంచి క్రేజ్ ఉంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఈ చిన్నది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది

దేత్తడి హారిక

యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 4లోకి అడుగు పెట్టింది. అందులో తన ఆట తీరుతో ఆకట్టుకుంది.

యూట్యూబ్‌లో వీడియోస్

బిగ్ బాస్ సీజన్ 4లోకి అడుగు పెట్టి ఈ అందాల చిన్నది టాప్ 5లో ఒకరిగా నిలిచింది. తన ఆటతీరు, మాట్లాడే విధానం ఇలా ప్రతీది అందరినీ ఆకర్షించుకుంది.

బిగ్ బాస్ సీజన్ 4

తర్వాత ఈ చిన్నది పలు షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో కూడా నటించింది. తన నటన, అందంతో కూడా ఈ అమ్మడు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

షార్ట్ ఫిల్మిస్, మూవీస్

ఇక ఈ బ్యూటీ 9 సెప్టెంబర్ 1997న  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ హిందూ కుటుంబంలో  జన్మించింది.  ఈ బ్యూటీకి ఒక సోదరుడు కూడా ఉన్నాడు.

జననం

ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్

తాజాగా ఈ అందాల చిన్నది తన ఇన్ స్టాలో పింక్ చీరలో పొలాల్లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి ప్రతి ఒక్కరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

బ్యూటిఫుల్ ఫొటోస్