2025లో రానున్న క్రేజీ పాన్ ఇండియా మూవీస్ ఇవే.. 

21 December 2024

Battula Prudvi

2025లో బుక్ ఆఫీస్ వద్ద ‘గేమ్ చేంజర్’ ఫస్ట్ టికెట్ తెగనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా రేంజ్‎లో విడుదల కానుంది.

వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న మరో సినిమా ‘తండేల్’. ఇది ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమైంది.

పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీర మల్లు పార్ట్ 1’ 2025 మార్చి 28న ప్రేక్షకులను అలరించనుంది.

డార్లింగ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ ‘ది రాజా సాబ్’ ఏప్రిల్ 10న ప్రేక్షకులకి పూనకాలు తెప్పిచడానికి సిద్ధంగా ఉంది.

దీని తర్వాత వారం గ్యాప్‎లో ఏప్రిల్ 18న అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘ఘాటీ’ విడుదల కానుంది.

అదే రోజు ‘హనుమాన్’తో మంచి గుర్తింపు తెచ్చుకొన్న తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న ‘మిరాయ్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కాంతారా చాప్టర్ 1’. ఇది 2025 అక్టోబర్ 2న పాన్ ఇండియా స్థాయిలో రానుంది.

అలాగే ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో ‘#ప్రభాస్‎హను’ వర్కింగ్ టైటిల్‎తో తెరకెక్కుతున్న  పీరియాడిక్ డ్రామా కూడా 2025లోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.