చీరలో చందమామలా..ఐశ్వర్య రాజేష్‌ను ఎంత బాగుందో..

samatha 

19 MAY 2025

Credit: Instagram

సంక్రాంతి సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న చిన్నది ఐశ్వర్య రాజేష్. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే.

వరల్డ్ ఫేమస్ లవ్ వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఏ మూవీకీ రాని క్రేజ్ ఈ చిన్నదానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది.

కుందనపు బొమ్మ ఐశ్వర్యరాజేష్ తమిళంలో వరస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకొని, టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ, ఫుల్ జోష్‌లో ఉంది.

హోమ్లీ క్యారెక్టర్స్‌తో తెలుగు అభిమానుల మనసుదోచుకుంటుంది ఈ చిన్నది. మరీ ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నా సినిమాలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. 

సాధారణ గృహిణిలా నటించి, మంచి ఫేమ్ సంపాదించుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరసగా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ తన వరస ఫొటో షూట్స్‌తో అభిమానులను అట్రాక్ట్ చేసుకుంటుంది. తాజాగా పట్టు చీరలో చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది.

 ఆరెంజ్,గోల్డ్ మిక్సింగ్ ఉన్న పట్టు చీరలో దానికి తగ్గట్లు బంగారు ఆభరణాలు ధరించి చాలా సింపుల్ లుక్‌లో అచ్చం తెలుగు అమ్మాయిలా చూడటానికి చాలా బాగుంది.

ఈ ఫొటోస్ చూసిన వారందరూ పట్టు చీరలో ఐశ్వర్యారాజేష్ చాలా అందంగా ఉంది. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ మీరు కూడా ఈ ఫోటోస్ పై ఓలుక్ వేయండి