వేణు మాధవ్,ఉదయభాను మధ్యలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా..టాలీవుడ్ స్టార్ కమెడీయన్!

samatha 

21 February 2025

Credit: Instagram

వేణు మాధవ్, ఉదయభాను మధ్యలో ఓ వ్యక్తి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇంతకీ చాలా బక్క పలుచ దేహంతో, వేణుమాధవ్, ఉదయ్ భాను మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా?

చెక్స్ షర్ట్ ధరించి, చాలా బక్కగా కనిపిస్తున్న ఈ వ్యక్తి ఇప్పడు టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్. ఇంతకీ అతను ఎవరంటే?

రచ్చరవి ఈ పేరు అందరికీ సుపరిచితమే. జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులను నవ్వించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.

తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి ప్రస్తుతం పలు సినిమాల్లో కమెడియన్‌గా చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు రచ్చరవి.

ఈయన కామెడీ అంటే చాలా మందికి ఇష్టం. అయితే రచ్చరవి చాలా రోజుల క్రితం, వన్స్ మోర్ ప్లీజ్ అనే టీవీ షోకి వెళ్లి తన టాలెంట్ పరీక్షించుకున్నాడు.

ఆ సమయంలోనే ఈయన వేణు మాధవ్, ఉదయ్ భానుతో కలిసి ఫొటో దిగగా, అది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇక రచ్చరవి, బలగం, భగవంత్ కేసరి, బీమా,లగ్గం  పురుషోత్తముడు, భలే ఉన్నాడే, నేడు రిలీజైన బాపు వంటి చాలా సినిమాల్లో నటించారు.