రామ్ చరణ్ నా కొడుకు లాంటోడు.. అలా అన్నందుకు సారీ..!

Prudvi Battula 

11 February 2025

ఈ మధ్యే తండేల్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.

అంతేకాదు ఆయన్ని దారుణంగా ట్రోల్ అయ్యేలా కూడా చేసాయి. దీనిపై తాజా స్పందించిన అల్లు అరవింద్ ఏమ్మన్నారు.? చూద్దాం..

నిర్మాత దిల్ రాజును స్టేజీ మీదకు ఆహ్వానించినపుడు.. వారంలోనే అన్నీ చూసాడు.. ఓ సినిమా ఇలా.. మరో సినిమాను అలా చేసాడు అంటూ కామెంట్ చేసారు అల్లు అరవింద్.

అందులో కావాలనే గేమ్ ఛేంజర్ సినిమాను అల్లు అరవింద్ తక్కువ చేసి మాట్లాడారంటూ ట్రోల్ చేసారు. ఇదే విషయంపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు మెగా నిర్మాత.

తండేల్ పైరసీ మీట్ గురించి చెప్పిన ప్రెస్ మీట్‌టో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘మొన్న ఓ సీనియర్ విలేఖరి దీని గురించి అడిగినపుడు ఇది సమయం కాదని నో కామెంట్స్ అని చెప్పాను.

ఆ రోజు నేను ఉద్దేశపూర్వకంగా అలా అనలేదు.. అనుకోకుండా అన్న మాటే.. నాకు రామ్ చరణ్ కొడుకు లాంటివాడు అన్నారు.

నేను అతడికి ఉన్న ఒకే ఒక్క మేనమామను.. నాకున్న ఒకే ఒక్క మేనల్లుడు రామ్ చరణ్.. మా ఇద్దరి మధ్య చాలా మంది అనుబంధం ఉంది.

దయచేసి మెగా అభిమానులు దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’ అన్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగిస్తే సంతోషంగా ఉంటుందని తెలిపారు అల్లు అరవింద్.

రామ్ చరణ్ అరంగేట్రం చేసిన చిరుత యావరేజ్ అనే కామెంట్స్ ఎందుకు చేసారు అని అడిగితే.. దానిపై స్పందించలేదు మెగా నిర్మాత.