చిరునవ్వుతూనే కట్టిపడేస్తున్న  సీరియల్ బ్యూటీ 

Rajeev 

28 May  2026

instagram

సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నటి తేజస్వి గౌడ ఒకరు. మోడల్, నటి అయిన తేజస్విని గౌడ కోయిలమ్మ సీరియల్ లో చిన్నీగా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది.

తెలుగు, కన్నడ, తమిళంలో స్మాల్ స్క్రీన్ పై ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ కన్నడ సీరియల్ 'బిలి హెండి'లొ తొలిసారిగా నటించింది.

ఆ తర్వాత స్టార్ మా లో ప్రసారమైన 'కోయిలమ్మ' సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల తార. తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. 

వీటితో పాటే 'సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్' అనే తమిళ సీరియల్‌తో మంచి గుర్తింపు పొందింది.

ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తుంది ఈ సుందరి. ఈ అమ్మడు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయింది. 

 22 నవంబర్ 1995లో జన్మించిన తేజస్విని బెంగళూరులో పెరిగింది. రాజరాజేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో B.Eలో కళాశాల డిగ్రీ పూర్తి చేసింది.

జానకి కలగనలేదు సీరియల్ నటుడు అమర్‌దీప్‌ ను తేజస్విని గౌడ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. అమర్ బిగ్ బాస్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్నాడు.