సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అందాల భామ శ్రద్ధా శ్రీనాథ్

05 october 2025

Rajeev 

సినీరంగంలో వైవిధ్యమైన పాత్రలతో తనదైన ముద్ర వేసిన హీరోయిన్ ఆమె. తక్కువ సమయంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు.

ఇటీవలే కలియుగం 2064 అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా కొన్ని ఫొటోల్లో తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

మొదటి సినిమాతోనే తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది ఈ అందాల భామ.

అంతకు ముందు 2015లో మలయాళంలో వచ్చిన కోహినూర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 

ఆ తర్వాత ముంగారు మేల్ 2, ఉర్వి, కాట్రు వెళియదై, ఇవన్ తంతిరాన్, విక్రమ్ వేద, రిచి, కృష్ణ అండ్ హిజ్ లీలా, డాకు మహారాజ్ వంటి చిత్రాల్లో నటించింది.