క్రేజీ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ సైలెంట్ అయ్యిందేంటబ్బా..! కొత్త సినిమా ఎప్పుడో..
Rajeev
12 April 2025
Credit: Instagram
శ్రద్ధా శ్రీనాథ్ ప్రధానంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం చిత్రాలలో నటిస్తుంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
శ్రద్ధా బెంగళూరులో చదువుకుంది మరియు బ్యాంకింగ్ రంగంలో కొంతకాలం పనిచేసింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది.
2015లో మలయాళ చిత్రం కోహినూర్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 2016లో కన్నడ చిత్రం యూ టర్న్ లో నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది.
తెలుగులో జెర్సీ చిత్రంతో నాని సరసన నటించి గుర్తింపు పొందింది. ఆతర్వాత తమిళ్ లోకి అడుగుపెట్టింది.
వరుసగా విక్రమ్ వేధ, నెర్కొండ పార్వై , మెకానిక్ రాకీ , డాకు మహారాజ్ సినిమాలో నటించింది.
శ్రద్ధా తన సహజ నటన, వైవిధ్యమైన పాత్రల ఎంపికతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఒక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు గెలుచుకుంది.
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.