సినిమాల స్పీడ్ తగ్గించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్..
05 october 2025
Rajeev
అందాల భామ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మరాఠీ బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.
. ఆ తర్వాత నెమ్మదిగా కథానాయికగా మారింది.
హిందీలో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంటూ అద్భుతమైన నటనతో మెప్పించింది. మృణాల్ కు ఎక్కువగా క్రేజ్ వచ్చింది
మాత్రం తెలుగు సినిమాతోనే.
డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసిం
ది.
దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది.
తెలుగుతోపాటు అటు హిందీలోనూ మరిన్ని ఆఫర్స్ అందుకుంది. అయితే ఫ్యామిలీ మ్యాన్ సినిమా తర్వాత మృణాల్ సైలెంట్ అయ్యింది.
ఈ సినిమా నిరాశపరచడంతో మృణాల్ కు అంతగా ఆఫర్స్ రావడం లేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
మఖానా తింటే ఎన్నిలాభాలో..పుట్టెడు ప్రయోజనాలు!
డ్రాగన్ ఫ్రూట్తో ఆరోగ్యం.. కానీ వీరు తిటే విషమే!
ఆరోగ్యమే కాదండోయ్ పుదీనాతో బోలెడు ప్రయోజనాలు!